KTR: ముదురుతున్న వివాదం... కవితకు షాక్ ఇచ్చిన కేటీఆర్
- టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవిత
- ఆ సంఘం ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వర్ ను నియమించిన కేటీఆర్
- పార్టీలో కవిత ప్రాధాన్యతను తగ్గిస్తున్నారంటూ కొత్త చర్చ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కవితకు కేటీఆర్ భారీ షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా కవిత ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కేటీఆర్ నియమించారు. ఈ నియమకం రాజకీయావర్గాల్లో చర్చకు తెర లేపింది. బీఆర్ఎస్ లో, ఆ పార్టీ అనుబంధ సంఘాల్లో కవిత ప్రాధాన్యతను తగ్గిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కవిత విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. మరోవైపు జాగృతి సంస్థను పటిష్టం చేసే పనిలో కవిత ఉన్నారు.