Chandrababu Naidu: సీఎం చంద్రబాబుపై సీఐఐ డైరెక్టర్, టాటా చైర్మన్ ప్రశంసల వర్షం

Chandrababu Naidu Praised by CII Director and Tata Chairman
  • ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన
  • చంద్రబాబును కలిసి నివేదిక అందించిన స్వర్ణాంధ్రప్రదేశ్-2047' టాస్క్ ఫోర్స్
  • చంద్రబాబు ఓ విజనరీ అని పేర్కొన్న సీఐఐ డైరెక్టర్
  • హైదరాబాద్ ఐటీలో దూసుకుపోవడానికి చంద్రబాబే కారణమన్న టాటా చైర్మన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ నాయకత్వం హైదరాబాద్‌ను ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టిందని ప్రముఖ పారిశ్రామికవేత్తలు కొనియాడారు. "పీపీటీ (PPT) అంటే ఏంటో మాకే తెలియని రోజుల్లో, ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ లు ఇచ్చి, పెట్టుబడులని ఆకర్షించే వాళ్ళు. దావోస్ లాంటి ప్రదేశాల్లో కూడా ఉదయం 7 గంటలకు మొదలు పెట్టి, అర్ధరాత్రి వరకు, తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కృషి చేసిన నేత చంద్రబాబు గారు" అంటూ సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ కొనియాడారు. 

టాటా సన్స్, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా ఇదే అభిప్రాయం వెల్లడించారు. "ఈ రోజు హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతుంది అంటే, అది చంద్రబాబు గారి విజన్.. మానవ వనరుల కోసం నాడు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కూడా పెట్టిన విజన్ చంద్రబాబు గారిది. ఆ రోజుల్లో ఐటీ అభివృద్ధి కోసం, మాతో ఉదయం 6 గంటల నుంచే చర్చలు మొదలు పెట్టే వారు. అదీ... చంద్రబాబు గారికి ఉన్న ప్యాషన్" అని చంద్రశేఖరన్ వివరించారు. 

ఇవాళ ఢిల్లీలో 'స్వర్ణాంధ్రప్రదేశ్-2047' టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. తాము రూపొందించిన నివేదికను ఆయనకు సమర్పించారు. ఈ కార్యక్రమంలోనే పైవిధంగా స్పందించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Hyderabad IT
CII Director
Tata Group
Chandrasekaran
IT Development
Investments
Swarnandhra Pradesh 2047

More Telugu News