Narendra Modi: ట్రంప్ వ్యాఖ్యలపై నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలి: జైరాం రమేశ్

Narendra Modi Must Answer Trumps Remarks Says Jairam Ramesh
  • భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని పదేపదే అంటున్న ట్రంప్
  • 21న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మోదీ సమాధానం చెప్పాలన్న జైరాం
  • ఎక్స్ వేదికగా పోస్టు చేసిన కాంగ్రెస్ నేత
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 23 సార్లు చెప్పారని, రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు.

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమని డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఈ నెల 21న పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

"భారత్-పాక్ మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఇప్పటికి 23 సార్లు ఆయన ఆ మాట చెప్పారు. రానున్న శీతాకాల సమావేశంలో రాజ్యసభ, లోక్‌సభలలో ప్రధానమంత్రి దీనిపై సమాధానం చెప్పాలి. దేశ ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు" అని జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
Narendra Modi
Donald Trump
India Pakistan
JaiRam Ramesh
Congress Party
Parliament Winter Session
Ceasefire Agreement
Nuclear War

More Telugu News