Syria: సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి.. భయంతో లైవ్‌లో పరుగెత్తిన న్యూస్ రీడర్ (ఇదిగో వీడియో)

Syria military headquarters attacked by Israel news reader flees live
  • డమాస్కస్ సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు
  • రక్షణ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సిరియన్ సైనిక వర్గాలు వెల్లడి
  • యాంకర్ న్యూస్ చదువుతుండగా లైవ్‌లో బాంబు దాడి దృశ్యాలు
సిరియా రాజధాని డమాస్కస్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ రక్షణ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసిందని సిరియన్ సైనిక వర్గాలు కూడా ధృవీకరించాయి.

సిరియాలోని స్వెయిదా ప్రాంతంలో స్థానిక మిలీషియాల మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మైనార్టీ షియా తెగకు చెందిన ద్రూజ్ మిలీషియాకు, సున్ని బెడ్విన్ తెగలకు మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది.

ద్రూజ్ జాతికి చెందిన ఒక కూరగాయల వ్యాపారిని కొందరు సాయుధులు దోచుకోవడంతో సమస్య ప్రారంభమైందని అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ద్రూజ్ జాతీయులు ఉన్నారు. అందులో సగం మంది సిరియాలో ఉన్నారు. మిగిలిన వారు ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల్లో నివసిస్తున్నారు.

లైవ్‌లో బాంబు దాడి

సిరియా రక్షణ శాఖ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది.  లైవ్‌లో ఒక న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుండగానే వెనుకబాంబు దాడి జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఆ న్యూస్ యాంకర్ భయంతో పరుగెత్తింది. ఈ న్యూస్ ఛానల్ కార్యాలయానికి సమీపంలోనే రక్షణ శాఖ కార్యాలయం ఉంది.
Syria
Israel
Syria military headquarters
Damascus
Israel attack
News reader
Sweida

More Telugu News