Chandrababu Naidu: ఢిల్లీలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం

Chandrababu Naidu Revanth Reddy Meet in Delhi
  • శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం
  • ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చించే అవకాశం
  • సమావేశానికి ముందు ఆయా రాష్ట్రాల అధికారులతో ముఖ్యమంత్రులు భేటీ
దేశ రాజధాని ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన పది అంశాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

అంతకుముందు, ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ఇరువురు ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అధికారులతో గంటన్నర పాటు సమావేశమయ్యారు.


   
     
Chandrababu Naidu
Revanth Reddy
Andhra Pradesh
Telangana
Water Resources
CR Patil

More Telugu News