Kaun Banega Crorepati: కేబీసీ 17వ‌ సీజ‌న్ ప్ర‌క‌ట‌న‌.. ఆస‌క్తిక‌రంగా ప్రోమో

Kaun Banega Crorepati Season 17 Announced with Interesting Promo
  • ఇప్ప‌టికే 16 సీజ‌న్‌లు పూర్తి చేసుకున్న కేబీసీ
  • ఆగస్టు 11న 17వ‌ సీజ‌న్ ప్రారంభం
  • కొత్త సీజ‌న్ ప్రోమోను విడుద‌ల చేసిన‌ సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్
  • ఈ సీజన్‌కు కూడా అమితాబ్ బచ్చనే హోస్ట్‌
పాప్యుల‌ర్‌ రియాలిటీ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) త్వ‌ర‌లోనే కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే 16 సీజ‌న్‌లు స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. మ‌రోవైపు ఈ ఏడాది ‘కేబీసీ’ చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయిని కూడా చేరుకుంది. 2000 జులై 3న ప్రారంభమైన ఈ షో ఇటీవ‌లే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 

ఇక‌, ఈ షో కొత్త సీజ‌న్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఈ ప్రోమోను సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ చాలా ఆస‌క్తిక‌రంగా రూపొందించింది. ఎప్పటిలాగే ఈ సీజన్‌కు కూడా బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 

కాగా, ఈ కొత్త సీజ‌న్ ఆగస్టు 11న ప్రారంభం అవుతుంద‌ని తాజాగా ప్ర‌క‌టించారు. అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌తో పాటు సోనీ లివ్ లో ప్రసారం కానుంది. 

Kaun Banega Crorepati
KBC Season 17
Amitabh Bachchan
Sony Entertainment Television
KBC Promo
Indian Reality Show
KBC Start Date
Sony LIV
KBC 25 Years

More Telugu News