బాలీవుడ్ నటుడు ఆసిఫ్ ఖాన్ కు గుండెపోటు

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫ్ ఖాన్
  • ఒక్క క్షణంలో అన్నీ మారిపోతాయని వ్యాఖ్య
  • జీవితంలో ఎవరు ముఖ్యమో వారితో ఆనందంగా గడపండని సూచన
బాలీవుడ్ నటుడు ఆసిఫ్ ఖాన్ గుండె పోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియా వేదికగా వివరించారు. గత కొన్ని గంటలుగా తాను ఆసుపత్రిలో ఉన్నానని... హాస్పిటల్ పైకప్పును చూసుకుంటూ... జీవితం ఎంత చిన్నదో గ్రహించానని చెప్పారు. ఒక్క క్షణంలో అన్నీ మారిపోతాయని, దేన్నీ తేలికగా తీసుకోకండని అన్నారు. 

జీవితంలో ఎవరు ముఖ్యమో వారితో ఆనందంగా గడపండని సూచించారు. జీవితం ఒక వరమని చెప్పారు. ప్రస్తుతం కోలుకుంటున్నానని... త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని తెలిపారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు కామెంట్ చేస్తున్నారు. 

ఆసిఫ్ ఖాన్ 2011లో 'రెడీ' చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. పలు చిత్రాల్లో విలక్షణమైన పాత్రలను పోషించారు. ప్రస్తుతం ఐదారు సినిమాల్లో నటిస్తున్నారు.


More Telugu News