BJP Activist: జై జగన్ అనలేదని... బీజేపీ కార్యకర్తను చిత్రహింసలు పెట్టిన వైసీపీ కార్యకర్తలు

BJP Activist Tortured by YSRCP Workers for Refusing to Say Jai Jagan
  • విజయవాడ పెనమలూరులో ఘటన
  • బీజేపీ కార్యకర్త గుడ్డలు ఊడదీసి దాడి చేసిన వైనం
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
విజయవాడ పెనుమలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జై జగన్ అనలేదంటూ ఓ బీజేపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు హింసించారు.

వివరాల్లోకి వెళితే... జై జగన్ అనేందుకు బీజేపీ కార్యకర్త నిరాకరించడంతో... ఆయనపై వైసీపీ కార్యకర్తలు గంగాధర్, బొర్రా వెంకట్ దాడికి పాల్పడ్డారు. ఆయన నుంచి ఫోన్, రూ. 3 వేలు లాక్కున్నారు. ఒంటి మీద దుస్తులు ఊడదీసి, దాడి చేసి, అవమానించారు. ఈ దాడి కారణంగా గాయాలతో బాధితుడు ఆసుపత్రిలో చేరాడు. నిన్న పెనుమలూరు పీఎస్ కు వెళ్లి తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితుడిపై దాడి జరిగిందని, త్వరలోనే నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగుచూసింది.
BJP Activist
Andhra Pradesh
YSRCP
Penamaluru
Vijayawada
Jai Jagan
Political Violence
Attack
G Gangadhar
Borra Venkat

More Telugu News