వాహనానికి పదే పదే రిపేర్లు.... షోరూం ముందు నిప్పంటించుకోబోయిన కస్టమర్!

  • ఝార్ఖండ్ లో ఘటన
  • 2024లో రూ.32 లక్షలతో టాటా సఫారీ వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి
  • వాహనంలో నిరంతరం సమస్యలు... 9 నెలలు సర్వీస్ సెంటర్ లోనే వాహనం!
  • విసిగిపోయిన కస్టమర్
ఝార్ఖండ్ లో, టాటా సఫారి కారు కొనుగోలు చేసిన ఓ కస్టమర్, పదే పదే సాంకేతిక సమస్యలు ఎదురవడంతో విసిగిపోయి ఆత్మహత్యాయత్నం చేశాడు. జంషెడ్‌పూర్‌లోని ఎఎస్‌ఎల్ మోటార్స్ షోరూమ్‌ వద్ద తన వాహనానికి నిప్పంటించి, తాను కూడా నిప్పంటించుకోబోయాడు. మంగళవారం నాడు ఈ ఘటన జరిగింది. 

సుమిత్ అనే కస్టమర్ జనవరి 2024లో సుమారు రూ. 32 లక్షలకు టాటా సఫారి ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. వాహనంలో నిరంతరం సమస్యలు తలెత్తడంతో, ఎస్‌యూవీని 8-9 సార్లు సర్వీస్ సెంటర్‌కు పంపినట్లు సుమిత్ తెలిపాడు. సమస్యలు పరిష్కరించకపోగా, దాదాపు తొమ్మిది నెలలు సర్వీస్ సెంటర్‌లో ఉన్నప్పుడు వాహనం వరదలకు గురై, తుప్పు పట్టి మరింత దెబ్బతిందని ఆరోపించాడు. 

కారు వైరింగ్‌ను సిబ్బంది మార్చారని, సమస్యలు పరిష్కరించకుండానే వాహనాన్ని తిరిగి తీసుకెళ్లాలని ఒత్తిడి చేశారని కూడా అతను ఆరోపించాడు. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని అతన్ని అడ్డుకున్నారు. ఆత్మహత్యాయత్నం శిక్షార్హమైన నేరం అని వారు అతడికి సర్దిచెప్పారు.


More Telugu News