Nara Lokesh: ఏరోస్పేస్ ఇండస్ట్రీకి భూములు ఇవ్వలేమన్న కర్ణాటక సర్కారు... ఏపీ వైపు చూడొచ్చు కదా అంటూ నారా లోకేశ్ పిలుపు

Nara Lokesh Invites Aerospace Industry to Andhra Pradesh After Karnataka Decision
  • కర్ణాటకలో ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కోసం భూసేకరణ
  • తీవ్రంగా వ్యతిరేకించిన రైతులు
  • భూసేకరణ ప్రక్రియ ఉపసంహరించుకున్న సిద్ధరామయ్య సర్కారు
  • తమ వద్ద అనుకూలమైన పాలసీ ఉందన్న నారా లోకేశ్
  • ఏపీకి రావాలంటూ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి ఆహ్వానం
బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకాలోని చన్నరాయపట్న, చుట్టుపక్కల గ్రామాల్లో ఏరోస్పేస్ ప్రాజెక్టు కోసం చేపట్టదలచిన భూసేకరణ ప్రక్రియను కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రైతుల తీవ్ర నిరసనల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
ఏరోస్పేస్ ప్రాజెక్టు కోసం 1,777 ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత ప్రణాళిక వేసింది. అయితే, ఈ ప్రాంతంలోని రైతులు, భూ యజమానులు భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పరిశ్రమలు తరలిపోయే అవకాశం ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ భూసేకరణను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు.

ఈ నేపథ్యంలో, ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "ఈ వార్త విన్నందుకు బాధగా ఉంది. అయితే, నా దగ్గర మీకోసం ఓ మంచి ఆలోచన ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు పరిశీలించకూడదు? మీ కోసం మా వద్ద ఒక ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ ఉంది. అత్యుత్తమ ప్రోత్సాహకాలతో పాటు, బెంగుళూరుకు దగ్గరగా 8,000 ఎకరాలకు పైగా భూమి కూడా ఉంది! త్వరలోనే మనం కూర్చుని మాట్లాడుకోవాలని ఆశిస్తున్నాను" అంటూ నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
Nara Lokesh
Karnataka
Andhra Pradesh
Aerospace Industry
Land Acquisition
Siddaramaiah
Aerospace Policy
Devanahalli
Channarayapatna
Farmers Protest

More Telugu News