Shubhanshu Shukla: భూమికి శుభాంశు శుక్లా.. స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

Shubhanshu Shukla Lands Safely PM Modi Responds
  • కాలిఫోర్నియా సముద్రంలో దిగిన వ్యోమనౌక
  • స్వాగతించే వారిలో నేనూ చేరుతానని మోదీ ట్వీట్
  • కోట్లాది మందికి శుభాంశు శుక్లా ప్రేరణను ఇచ్చారన్న మోదీ
యాక్సియం-4 మిషన్ విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌక కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో దిగింది. ఈ సందర్భంగా మోదీ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.

అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను స్వాగతించే భారత ప్రజల్లో తాను కూడా ఒకడినని ఆయన పేర్కొన్నారు. శుభాంశు శుక్లా తన అంకితభావం, ధైర్యం, మార్గదర్శక స్ఫూర్తి ద్వారా కోట్లాది మందికి ప్రేరణ ఇచ్చారని ప్రశంసించారు. ఇది భారత మానవ సహిత అంతరిక్ష మిషన్ గగన్‌యాన్ దిశగా మరో ముందడుగు అని ఆయన అభివర్ణించారు.
Shubhanshu Shukla
Narendra Modi
Maximum-4 Mission
Indian Space Mission
Gaganyaan

More Telugu News