Sreeleela: ఫ్లాపులలోను పారితోషికాన్ని పరిగెత్తిస్తున్న శ్రీలీల! 

Sreeleela Special
  • శ్రీలీల తాజా చిత్రంగా 'జూనియర్'
  • కన్నడలో రూపొందిన సినిమా 
  • ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల
  • హీరోగా గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు పరిచయం
  • సినిమా భారమంతా శ్రీలీలపైనే   

తెలుగు తెరపై శ్రీలీల రాకెట్ వేగంతో దూసుకొచ్చింది. పూజ హెగ్డే .. రష్మిక ..  కీర్తి సురేశ్ జోరు ఇక్కడ కొనసాగుతూ ఉండగానే శ్రీ లీల ఎంట్రీ ఇచ్చింది. వరుస అవకాశాలతో దూసుపోయింది. ఒకానొక దశలో ఎక్కడ చూసినా ఆమె సినిమా షూటింగులే కనిపించాయి. ఆ స్థాయిలో ఈ మధ్య కాలంలో జోరు చూపించిన కథానాయికలు ఎవరూ లేరనే చెప్పాలి. స్టార్ హీరోల సరసన సందడి చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఓ కొత్త హీరో జోడీ కడుతోంది. ఆ సినిమా పేరే 'జూనియర్'. 'జూనియర్' .. యూత్ ను టచ్ చేస్తూ సాగే ఫ్యామిలీ డ్రామా. గాలి జనార్థనరెడ్డి తనయుడు కిరీటీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో, అతని జోడీగా శ్రీలీల ఆడిపాడనుంది. కీలకమైన పాత్రలో జెనీలియా కనిపించనుంది. రాధాకృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం శ్రీలీల భారీ పారితోషికం తీసుకుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.శ్రీలీల ఖాతాలో భారీ హిట్లు ఉన్నాయి. వాటి సంఖ్య తక్కువే అయినా అవి చూపించిన ప్రభావం ఎక్కువ. కొంతకాలంగా శ్రీలీలకు పెద్ద హిట్లు లేవు. అలాగని చెప్పి ఆమె క్రేజ్ ఏమీ తగ్గలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు .. తమిళ .. హిందీ సినిమాలు ఉన్నాయి. అలాంటి ఆమె ఒక కొత్త  హీరో జోడీగా ఓకే చేయడమంటే రిస్క్ తో కూడిన వ్యవహారమే. కథా భారమంతా ఆమెనే మోయవలసి ఉంటుంది. అందువల్లనే భారీ మొత్తాన్నే పారితోషికంగా తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఆమె అత్యధిక పారితోషికం అందుకున్న సినిమా ఇదేనని అంటున్నారు. మరి ఈ సినిమా శ్రీలీలకి పారితోషికం మాత్రమే మిగిలేలా చేస్తుందా? సక్సెస్ ను కూడా తీసుకొస్తుందా? అనేది చూడాలి. 

Sreeleela
Junior Movie
Kiriti Reddy
Genelia
Radha Krishna Reddy
Telugu cinema
Kannada movie
Tollywood
actress remuneration
movie promotions

More Telugu News