పోలీసుల సూచనతో తాడిపత్రిలో తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్న పెద్దారెడ్డి

  • నేడు తాడిపత్రికి వెళ్లాలనుకున్న పెద్దారెడ్డి
  • అనుమతిని నిరాకరించిన పోలీసులు
  • మంత్రుల కార్యక్రమం ఉందన్న పోలీసులు
తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 'రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో' కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాడిపత్రికి వెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రెడీ అయ్యారు. తాడిపత్రికి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన పోలీసులను కోరారు. అయితే పెద్దారెడ్డికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. తాడిపత్రికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. 

ఈరోజు తాడిపత్రిలో మంత్రుల కార్యక్రమం ఉందని... మీరు తాడిపత్రికి వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పెద్దారెడ్డికి నోటీసులు అందించారు. ఈ నెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చని సూచించారు. ఈ క్రమంలో చేసేదేమీ లేక పెద్దారెడ్డి వెనక్కి తగ్గారు. తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ నెల 18న 'రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పెద్దారెడ్డి చెప్పారు. 

మరోవైపు గతంలో కూడా తాడిపత్రికి వచ్చిన పెద్దారెడ్డిని శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఆయనను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.


More Telugu News