Srisailam Project: తగ్గిన వరద ప్రవాహం .. శ్రీశైలం గేట్లు మూసివేత

Srisailam Project Gates Closed as Flood Flow Decreases
  • ఈ నెల 8న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను తెరిచి దిగువకు నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
  • సుంకేసుల, జూరాల నుంచి శ్రీశైలంకు తగ్గిన వరద ప్రవాహం
  • శ్రీశైలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 882.50
  • కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 68,753 క్యూసెక్కులు నాగార్జునసాగర్ కు విడుదల  
ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి గత పది రోజులుగా కొనసాగిన వరద ప్రవాహం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. వరద ప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుండి శ్రీశైలం జలాశయానికి 65,985 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 68,753 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులుగా నమోదైంది.

గత వారం సుంకేసుల, జూరాల నుంచి నిత్యం లక్షకు పైగా క్యూసెక్కుల వరద రావడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో, ఈ నెల 8న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో డ్యామ్ అధికారులు గేట్లను తెరిచిన విషయం విదితమే. అయితే, గత నాలుగు రోజులుగా వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లు మూసివేశారు. 
Srisailam Project
Srisailam dam
Srisailam gates
Flood discharge
Nagarjuna Sagar
Jurala project
Sunkesula project
Andhra Pradesh floods
Chandrababu Naidu
Nimmala Ramanayudu

More Telugu News