రాజు గారి నియామకం రాష్ట్రానికే గర్వకారణం: నారా లోకేశ్

  • గోవా రాష్ట్ర గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియామకం
  • హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేశ్
  • గవర్నర్ పదవికి గొప్ప గౌరవం తెస్తారంటూ సోషల్ మీడియాలో పోస్టు
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 

సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "అశోక్ గజపతి రాజు గారు సమగ్రత, నీతి, ప్రజా సేవకు అంకితభావం వంటి లక్షణాలతో గవర్నర్ కార్యాలయానికి గొప్ప గౌరవాన్ని తీసుకొస్తారని నమ్ముతున్నాను" అని లోకేశ్ పేర్కొన్నారు. రాజు గారి నియామకం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని ఆయన అభివర్ణించారు.


More Telugu News