Savitri: సావిత్రి గారి గురించి నాకు తెలుసు: నటి రాజసులోచన కూతురు!

Guruswami Interview
  • ఒక వెలుగు వెలిగిన రాజసులోచన 
  • షికాగోలో ఉంటున్న కూతురు
  • తన తల్లికి సావిత్రిగారు చాలా క్లోజ్ ని వెల్లడి 
  • సావిత్రిగారికి ఆర్ధిక ఇబ్బందులు లేవని వివరణ

రాజసులోచన .. ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన నటి. నెగెటివ్ రోల్స్ చేయడంలోను తనకి తానే సాటి అనిపించుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఆమె ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. అలాంటి రాజసులోచన కూతుర్లలో ఒకరైన 'దేవి' చెన్నైలో ఉంటే, మరొకరైన గురుస్వామి 'షికాగోలో ఉంటున్నారు. తాజాగా ఆమె 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకున్నారు.

" మా అమ్మగారి వాళ్లది విజయవాడ .. మా ఫాదర్ సీఎస్ రావుగారి వాళ్లది కాకినాడ. మేము పుట్టి పెరిగింది చెన్నైలో. అమ్మకి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఒక వ్యక్తితో పెళ్లి అయింది. ఎన్నో కష్టాలు పడిన తరువాత విడాకులు తీసుకుంది. ఆ తరువాతనే సీఎస్ రావుగారిని చేసుకోవడం జరిగింది. అప్పట్లో అమ్మ - నాన్న చాలా బిజీ. అందువలన మేము అమ్మమ్మగారి దగ్గర పెరిగాము. అప్పట్లో అమ్మతో కలిసి నటించడానికి చాలామంది టెన్షన్ పడేవారట" అని అన్నారు. 

"అప్పట్లో అమ్మతో సావిత్రిగారు .. బి. సరోజాదేవి గారు .. దేవిక గారు .. రాజశ్రీ గారు .. శారదగారు చాలా సన్నిహితంగా ఉండేవారు. ముఖ్యంగా పక్క వీధిలోనే ఉండటం వలన,  సావిత్రిగారు తరచూ మా ఇంటికి వచ్చేవారు. సావిత్రిగారి చివరి రోజులలో అమ్మ ఆమెకి చాలా సపోర్ట్ గా నిలిచారు. సావిత్రిగారు చివరిరోజులలో ఆర్ధికంగా చితికి పోయారని చాలామంది అంటూ ఉంటారు. కానీ అందులో నిజం లేదు" అని చెప్పారు.  

Savitri
Rajasulochana
Telugu actress Savitri
actress Rajasulochana
B Saroja Devi
actress Devika
actress Rajasree
Sharada
CS Rao
Chennai

More Telugu News