ఇండోనేషియాలో భారీ భూకంపం

  • తులాల్ నగరానికి 117 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం
  • రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం
  • సునామీ వచ్చే అవకాశాలు లేవని వాతావరణ కేంద్రం వెల్లడి
ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. తులాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతగా నమోదైంది. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

పశ్చిమ ఇండోనేషియాలో ఈ మధ్యాహ్నం 12:49 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం కారణంగా అనేక ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు వారు వెల్లడించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి.

ఇండోనేసియాను నిత్యం భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వెంటాడుతుంటాయి. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపం కారణంగా ఒక్క ఇండోనేషియాలోనే 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతం 'రింగ్ ఆఫ్ ఫైర్‌'గా పిలిచే అగ్నిపర్వతాల జోన్‌లో ఉంది.

 


More Telugu News