రిటైర్డ్ హెడ్ మాస్టర్ కు రూ.15 లక్షల కరెంటు బిల్లు... ఏపీలో విచిత్రం!

  • కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఘటన
  • 1 లక్షకు పైగా యూనిట్లు వాడినట్టు బిల్లు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన రిటైర్డ్ హెడ్ మాస్టర్
ఏపీలో ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కు వచ్చిన కరెంటు బిల్లు చూస్తే ఎవరైనా బేజారెత్తిపోవాల్సిందే. ఆయన ఇంటికి ఏకంగా రూ.15 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ పేరు నన్నేషా హుస్సేన్. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఉంటున్నారు. గత నెల విద్యుత్ వాడకానికి సంబంధించిన బిల్లు అందుకుని ఆయన షాక్ కు గురయ్యారు. 

అందులో... 1 లక్షకు పైగా యూనిట్లు వినియోగించినట్టు ఉంది. అందుకు గాను రూ.15,14,993 బిల్లు వచ్చింది. దీనిపై రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్ మేన్ ను అడిగితే, మీటర్ లో లోపం ఉందని, మరో మీటర్ కు అప్లై చేసుకోవలని చెబుతున్నాడని, తాను అలా చేయనని స్పష్టం చేశారు. తాను డబ్బు కట్టి డిజిటల్ మీటర్ తీసుకున్నానని, ఇలాంటి లోపాలతో కరెంటు బిల్లులు వస్తుంటే పేదల పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


More Telugu News