తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని మిస్ అవుతోంది సర్: కోట మృతిపై ఆది సంతాపం
- సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
- సోషల్ మీడియాలో స్పందించిన ఆది సాయికుమార్
- ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్
తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం ఉదయం కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.
కోట మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా, యువ నటుడు ఆది సాయికుమార్ కూడా సోషల్ మీడియా వేదికగా కోట మరణం పట్ల స్పందించారు.
"లెజెండరీ యాక్టర్ కోట గారు ఇక లేరు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం... తెలుగు సినీ ఇండస్ట్రీ మిమ్మల్ని మిస్ అవుతోంది సర్" అంటూ ఆది ట్వీట్ చేశారు.