Droupadi Murmu: రాజ్యసభకు నలుగురు ప్రముఖులు.. నామినేట్ చేసిన రాష్ట్రపతి

Droupadi Murmu Nominates Four Prominent Individuals to Rajya Sabha
––
రాజ్యసభకు నలుగురు కొత్త సభ్యులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా నామినేట్ చేశారు. పలువురు సభ్యుల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త సభ్యులను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాహిత్యం, సైన్స్, కళలు మరియు సామాజిక సేవ వంటి రంగాలలో విశేష సేవలందించిన ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఏ) ద్వారా సంక్రమించిన అధికారంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా లాయర్ ఉజ్వల్‌ నిగమ్‌, సదానందన్‌, హర్షవర్ధన్‌, మీనాక్షి జైన్‌ లను రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేశారు.

ఇదీ నేపథ్యం..
ఉజ్వల్ దేవరావు నికమ్.. 26/11 ముంబై ఉగ్రవాద దాడులతో సహా అనేక ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.
సదానందన్ మాస్తే.. కేరళలో అట్టడుగు వర్గాలకు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న సామాజిక కార్యకర్త, విద్యావేత్త.
హర్ష్ వర్ధన్ ష్రింగ్లా.. భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, దౌత్యవేత్త.
డాక్టర్ మీనాక్షి జైన్.. ప్రముఖ చరిత్రకారిణి, విద్యావేత్త.
Droupadi Murmu
Rajya Sabha
Ujjwal Nikam
Sadanandan Maste
Harsh Vardhan Shringla
Meenakshi Jain
Indian President
Parliament
Nominated Members
India

More Telugu News