రేణు దేశాయ్‌కి సర్జరీ...?

  • మరోసారి వార్తల్లో నిలిచిన రేణు దేశాయ్
  • సర్జరీ తర్వాత నా క్యూటీతో కలిసి డిన్నర్‌కు వెళ్లాను అంటూ ఇన్‌స్టాలో రేణు దేశాయ్ పోస్టు
  • అసలు రేణు దేశాయ్‌కు ఏమైందంటూ అభిమానుల్లో చర్చ
నటి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక పోస్ట్ ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది. కుమార్తె ఆద్యతో కలిసి డిన్నర్‌కు వెళ్ళిన రేణు దేశాయ్, సెల్ఫీకి ఫోజు ఇచ్చి దానిని సోషల్ మీడియాలో పంచుకుంది. "సర్జరీ తర్వాత నా క్యూటీతో కలిసి డిన్నర్‌కు వెళ్ళాను" అని ఆమె ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది. 

అయితే, ఈ పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. రేణు దేశాయ్ "సర్జరీ తర్వాత" అని పేర్కొనడంతో, ఆమెకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, రేణు దేశాయ్ తనకు ఏ సర్జరీ జరిగిందో, ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నారో వంటి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

పవన్ కల్యాణ్‌తో 2012లో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ చాలా కాలం పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఆమె మళ్ళీ వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల రెండు సినిమాలకు సంతకం చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ తెలిపింది. ప్రస్తుతం రేణు దేశాయ్ ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఆమె సర్జరీ గురించి అభిమానుల్లో చర్చ జరుగుతోంది. 


More Telugu News