నెల రోజుల పాటు సెలవులో వీసీ సజ్జనార్!

  • రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేంద్ర మోహన్‌కు తాత్కాలిక బాధ్యతలు
  • 2021 నుండి టీజీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్
  • వ్యక్తిగత కారణాలతో సెలవులకు సజ్జనార్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు పాటు సెలవులు మంజూరు చేసింది. సజ్జనార్ సెలవుల్లో ఉండనున్న ఈ నెల రోజులు టీజీఎస్ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

సజ్జనార్ 2021 నుండి టీజీఎస్ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. ఆర్టీసీని ఆర్థిక స్థిరత్వం దిశగా నడిపించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెలవులపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యక్తిగత కారణాలతో సెలవులు తీసుకున్నట్లు తెలుస్తోంది.ె


More Telugu News