బీసీ రిజర్వేషన్లు అంశం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పాయల్ శంకర్ విమర్శలు
- బీసీ రిజర్వేషన్లకు మతపరమైన అంశాన్ని జోడించారని విమర్శలు
- మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంగీకరించవని వెల్లడి
- కాంగ్రెస్ ఎప్పుడూ మాట మీద నిలబడలేదన్న పాయల్ శంకర్
బీసీ రిజర్వేషన్లకు మతపరమైన అంశాన్ని జోడించారని, మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంగీకరించవని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చూస్తుంటే బీసీలను మోసం చేస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్డినెన్సు తీసుకురాకుండానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడలేదని ఆయన మండిపడ్డారు.
శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేస్తారో చర్చించాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా, బీసీలకు అన్యాయం జరగకుండా ఇచ్చిన మాటకు కట్టుబడాలని ఆయన సూచించారు.