జగన్ మనసులోని మాటలనే పేర్ని నాని, ప్రసన్న మాట్లాడుతున్నారు: దేవినేని ఉమ

  • జగన్ ను ప్రజలు లేవకుండా చేశారన్న దేవినేని ఉమ
  • సింగయ్య భార్యను బెదిరించి తప్పుడు ప్రకటన ఇప్పించారని మండిపాటు
  • విజయసాయి భగవద్గీత శ్లోకాలు వల్లిస్తున్నారని ఎద్దేవా
151 సీట్లు గెలిచామనే మదంతో జగన్ ఇష్టానుసారం వ్యవహరించారని... దీంతో 11 సీట్లతో ప్రజలు ఆయనను లేవకుండా చేశారని టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. చీకట్లో కన్నుకొట్టే తప్పుడు పనులు చేయడం వల్లే ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. తాజాగా పేర్ని నాని కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారని... ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. 

సొంత పార్టీ కార్యకర్త సింగయ్యను కారుతో తొక్కించిన జగన్... ఆ తప్పును కప్పిపుచ్చేందుకు సింగయ్య భార్యను బెదిరించి తప్పుడు ప్రకటన ఇప్పించారని దేవినేని అన్నారు. సోదరి వరుస అయ్యే మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జగన్ ఖండించకుండా సమర్థించారని మండిపడ్డారు. జగన్ మనసులోని మాటలనే పేర్ని నాని, ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు.

కర్మఫలం అంటూ విజయసాయిరెడ్డి భగవద్గీత శ్లోకాలు వల్లిస్తున్నారని.... నీ దగ్గర పని చేసిన అధికారులే సిట్ విచారణలో నీ గుట్టు విప్పుతున్నారని దేవినేని ఉమా అన్నారు.


More Telugu News