పాక్ నటి హుమైరా పోస్టుమార్టం రిపోర్ట్.. దారుణ విషయాలు వెలుగులోకి!
- 9 నెలల క్రితమే మరణించిన నటి
- వారం రోజుల క్రితం ఆమె మృతదేహం గుర్తింపు
- గుర్తించలేని స్థితిలో ఆమె ప్రధాన అవయవాలు
- పూర్తిగా కుళ్లిపోయిన మెదడులోని పదార్థం
- శరీర అవశేషాల్లో పురుగుల గుర్తింపు
తొమ్మిది నెలల క్రితం చనిపోయి వారం రోజుల క్రితం బయటపడిన పాకిస్థాన్ నటి, మోడల్ హుమైరా అస్ఘర్ అలీకి సంబంధించి నిర్ఘాంతపరిచే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఆమె ప్రధాన అవయవాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. అలాగే, ఆమె ముఖం కూడా గుర్తుపట్టలేనంత ఉందని నివేదికలో పేర్కొన్నారు.
శరీర భాగాల్లో కండరాల కణజాలం పూర్తిగా లేకుండా పోయిందని, ఎముకలను తాకినప్పుడు విరిగిపోయాయని నివేదిక పేర్కొంది. మెదడులోని పదార్థం పూర్తిగా కుళ్లిపోయిందని అందులో పేర్కొన్నారు. అంతర్గత అవయవాలు నల్లగా మారిపోయాయని, కీళ్లలో మృదులాస్థి లేదని, ఎముకల్లో ఎలాంటి పగుళ్లు కనిపించలేదని నివేదిక తెలిపింది. అంతేకాదు, పోస్టుమార్టం సందర్భంగా శరీర అవశేషాల్లో పురుగులను కూడా గుర్తించారు. ఆమె ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయిందో తెలుసుకునేందుకు ఈ వివరాలు సహాయపడతాయని నిపుణులు పేర్కొన్నారు.
పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. హుమైరా తల, వెన్నెముక చెక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ, శరీరం బాగా కుళ్లిపోవడంతో వెన్నుపాము కనిపించలేదు. ఆమె జుట్టులో గోధుమరంగు పురుగులు ఉన్నాయి. తెల్లని పురుగులు మాత్రం కనిపించలేదు. శరీరం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటం వల్ల ఆమె మృతికి గల కచ్చితమైన కారణం తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు డీఎన్ఏ, టాక్సికాలజీ పరీక్షలు చేస్తున్నారు.