పన్ను ఎగవేతలు అడ్డుకోవడానికి టెక్నాలజీ ఉపయోగించండి: సీఎం చంద్రబాబు

  • అమరావతిలో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం
  • దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
  • జీఎస్టీ వసూళ్లలో దేశానికి ఏపీ రోల్ మోడల్ లా ఉండాలని ఆకాంక్ష
ఏపీ సీఎం చంద్రబాబు నేడు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పన్ను ఎగవేతలను అడ్డుకోవడానికి టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. అందుకోసం డేటా అనలిటిక్స్ సాయం తీసుకోవాలని అన్నారు.

చంద్రబాబు అధికారులకు చేసిన సూచనలు...
  • సమర్థవంతమైన పన్ను వసూళ్ల విధానం ద్వారా జాతీయ సంపదను పెంచాలి. ఆ సంపదను ప్రజా సంక్షేమం, అభివృద్ధికి వినియోగించాలి
  • జీఎస్టీ వసూళ్లలో ఏపీ దేశానికే రోల్ మోడల్ లా ఉండాలి
  • జీఎస్టీకి సంబంధించి పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా యాక్షన్ ప్లాన్ ఉండాలి
  • జీఎస్టీ రియలైజేషన్ కోసం కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య సమాచార సమన్వయం ఉండాలి
  • ఎగవేతలను గుర్తించేందుకు విద్యుత్ వినియోగం తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి
  • ఏపీలో ఎక్కడా పన్ను ఎగవేతలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి
  • జీఎస్టీ రిజిస్ట్రేషన్లలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి


More Telugu News