Stock Markets: ఐటీ షేర్ల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

IT Stocks Drag Down Indian Stock Markets
  • మెప్పించలేకపోయిన టీసీఎస్ క్యూ1 ఫలితాలు
  • 689 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 205 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు సూచీలను కిందకు పడేశాయి. టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు మెప్పించకపోవడంతో ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఒకానొక దశలో 700 పాయింట్ల మేర నష్టపోయింది. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 689 పాయింట్ల నష్టంతో 82,500కి దిగజారింది. నిఫ్టీ 205 పాయింట్లు కోల్పోయి 25,149 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టైటాన్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఎటర్నల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.80గా ఉంది.
Stock Markets
Sensex
Nifty
TCS
IT Stocks
Indian Stock Market
Share Market
Rupee
BSE
NSE

More Telugu News