Payyavula Keshav: లిక్కర్ స్కామ్ లో వాస్తవాలు దేశం నివ్వెరపోయేలా ఉన్నాయి: పయ్యావుల

AP Liquor Scam Facts Shocking Says Payyavula Keshav
  • సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్న పయ్యావుల
  • ఐఐటీ ప్రొఫెషనల్స్ తో బాక్సులకు బాక్సుల డబ్బులు తరలించారని ఆరోపణ
  • బుగ్గన బుర్రకథలు ఆపాలని హితవు
ఏపీ లిక్కర్ స్కామ్ పై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో ఐఐటీ ప్రొఫెషనల్స్, ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని బాక్సులకు బాక్సుల డబ్బులు తరలించారని ఆరోపించారు. యావత్ దేశం నివ్వెరపోయేలా లిక్కర్ స్కామ్ లో వాస్తవాలు ఉన్నాయని చెప్పారు. 

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఉదయ్ భాస్కర్ రెడ్డి దాదాపు 200 తప్పుడు మెయిల్స్ పెట్టాడని... ఆయనపై కేసులు పెట్టి తీరతామని అన్నారు. బంగారుపాళ్యంలో జగన్ పర్యటన సందర్భంగా ట్రాక్టర్ ల నుంచి బలవంతంగా మామిడికాయలు కింద పారబోశారని మండిపడ్డారు. ట్రాక్టర్ లాక్కొచ్చి చేసిన ట్రిక్స్ డ్రోన్ కెమెరాల్లో బయటపడ్డాయని తెలిపారు. వైసీపీలో అస్తిత్వం కోసం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని... వెటకారం తగ్గించుకోవాలని, ఇప్పటికైనా బుర్రకథలు ఆపాలని హితవు పలికారు. జగన్ రోడ్డు మీదకు వస్తే తలకాయలు కానీ, మామిడికాయలు కానీ పగలాల్సిందేనని చెప్పారు.
Payyavula Keshav
Andhra Pradesh
AP Liquor Scam
Liquor Scam
Excise Policy
Uday Bhaskar Reddy
Buggana Rajendranath Reddy
Jagan Mohan Reddy
Corruption
Andhra Pradesh Politics

More Telugu News