Radhika Yadav: టెన్నిస్ క్రీడాకారిణి హత్య.. కూతుర్ని చంపిన తండ్రికి నెలకు రూ.15 లక్షల ఆదాయం!

Radhika Yadav Tennis Player Murder Father Earns Lakhs
  • తన సంపాదనతో బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతో చంపేశానన్న తండ్రి
  • తండ్రి చెప్పిన మాటల్లో వాస్తవం లేదని చెబుతున్న స్థానికులు
  • అద్దె, ఇతర మార్గాల్లో తండ్రి ఆదాయం రూ.15 లక్షల వరకు ఉంటుందని వెల్లడి
  • ఈ హత్యకు ఇంకోదో కారణం ఉండవచ్చని అనుమానం
"నా సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నావు" అంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే హత్యకు పాల్పడ్డానని హర్యానా టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ తండ్రి దీపక్ యాదవ్ వెల్లడించాడు. అయితే, అతని వాదనలో నిజం లేదని కుటుంబ సభ్యులతో పరిచయం ఉన్నవారు, స్థానికులు చెబుతున్నారు. దీపక్ యాదవ్‌కు నెలనెలా అద్దె, ఇతర మార్గాల ద్వారా లక్షల్లో ఆదాయం వస్తుందని వారు పేర్కొంటున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణి, కోచ్ రాధికా యాదవ్ గురుగ్రామ్‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. నిన్న కుమార్తె వంట చేస్తుండగా తండ్రి దీపక్ యాదవ్ వెనుక నుంచి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రాధికా యాదవ్ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. తన సంపాదనపై ఆధారపడ్డారంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే హత్య చేశానని నిందితుడు పేర్కొన్నాడు.

అతను చెబుతున్న దాంట్లో నిజం లేదని కుటుంబంతో పరిచయం ఉన్నవారు చెబుతున్నారు. దీపక్ స్వగ్రామం వజీరాబాద్‌కు చెందిన కొందరు మీడియాతో మాట్లాడుతూ గురుగ్రామ్‌లో అతనికి చాలా ఆస్తులు ఉన్నాయని తెలిపారు. వాటి ద్వారా అద్దె, ఇతర మార్గాల్లో నెలకు రూ. 15 లక్షల నుంచి రూ. 17 లక్షల వరకు ఆదాయం వస్తుందని వారు వెల్లడించారు. అంతేకాకుండా అతనికి ఒక విలాసవంతమైన ఫాంహౌస్ కూడా ఉందని చెప్పారు.

అంతటి ఆస్తి ఉన్న వ్యక్తి తన కూతురుపై ఆధారపడి జీవిస్తున్నాడని ఎలా నమ్ముతామని వారు ప్రశ్నిస్తున్నారు. కుమార్తె అంటే అతనికి ఎంతో ప్రేమ అని, ఆమె రాణించాలని రూ. 2 లక్షలు పెట్టి రాకెట్లు కూడా కొనుగోలు చేశాడని తెలిపారు. ఈ హత్యకు వేరే ఏదో కారణం ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Radhika Yadav
Haryana tennis player
Deepak Yadav
Gurugram murder
tennis player murder

More Telugu News