Vangalapudi Anitha: నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి ఇదే: అనిత

Vangalapudi Anitha Education is the Property My Father Gave Me
  • చదువుకు మించిన ఆస్తి లేదన్న అనిత
  • తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తి చదువేనని వెల్లడి
  • అమ్మను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచన
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, తప్పుడు పోస్టులు పెట్టేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సామాజిక మాధ్యమాల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరినీ తల్లిదండ్రులు సమానంగా చూడాలని అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను ఒకప్పుడు టీచర్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతానని అనిత అన్నారు. తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తి చదువు అని తెలిపారు. చదువుకు మించిన ఆస్తి లేదని చెప్పారు. కనిపించే దేవత అయిన అమ్మను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. తమ ప్రభుత్వంలో తల్లిదండ్రులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని చెప్పారు. 

జగన్ పాలనలో గంజాయి ఏరులై పారేదని విమర్శించారు. తమ ప్రభుత్వంలో గంజాయి కేసుల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చుదామని పిలుపునిచ్చారు. గంజాయి మత్తులో పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Vangalapudi Anitha
AP Home Minister
Social Media
Fake Posts
Nakkapalli
Government Degree College
Education
Ganja
Andhra Pradesh
TDP Government

More Telugu News