Shruti Haasan: పవన్ కు రాజకీయ రంగం సరిపోతుంది: శృతి హాసన్

Shruti Haasan Says Pawan Kalyan Fits Perfectly in Politics
  • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శృతి హాసన్
  • గబ్బర్ సింగ్ చిత్రంతో తన కెరీర్ మలుపు తిరిగిందని వెల్లడి
  • సెట్స్ పై పవన్ ఎప్పుడూ వ్యవసాయం, గ్రామాల గురించి మాట్లాడేవారని వివరణ
అందాల హీరోయిన్ శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రంతో తన కెరీర్ మలుపు తిరిగిందని వెల్లడించారు. వాస్తవానికి ఆ చిత్రంలో తాను నటించనని చెప్పానని, అయితే ఆ పాత్రలో తనను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేదని దర్శకుడు హరీశ్ శంకర్ తను ఒప్పించారని శృతి వివరించారు. తనకు తొలి విజయం దక్కింది టాలీవుడ్ లోనే అని స్పష్టం చేశారు. 

ఇక, గబ్బర్ సింగ్ హీరో పవన్ కల్యాణ్ గురించి చెబుతూ... సెట్స్ పై ఆయన ఎక్కువగా రైతుల గురించి, గ్రామాల గురించి మాట్లాడుతుండేవారని ఆమె తెలిపారు. పవన్ కు రాజకీయ రంగం సరిగ్గా సరిపోతుందని శృతి అభిప్రాయపడ్డారు. కాగా శృతి హాసన్ ప్రస్తుతం తమిళంలో తలైవా రజనీకాంత్ సరసన కూలీ చిత్రంలో నటిస్తున్నారు. 
Shruti Haasan
Pawan Kalyan
Gabbar Singh
Harish Shankar
Tollywood
Politics
Coolie Movie
Rajinikanth
Telugu Cinema
Farmers

More Telugu News