జూనియర్ యువరాజ్ ను చూశారా... వేలెడెంత లేడు... తండ్రితో పోజులు!

  • తనయుడు ఓరియన్ తో కలిసి ఓ ఈవెంట్ లో పాల్గొన్న యువీ
  • తండ్రితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చిన ఓరియన్
  • నెట్టింట సందడి చేస్తున్న ఫొటోలు
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా తన కుమారుడు ఒరియన్ తో కలిసి ఓ ఈవెంట్ లో సందడి చేశాడు. తండ్రి వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న జూనియర్ యువరాజ్ ను ఆ ఫొటోల్లో చూడొచ్చు. తండ్రీకొడుకులు ఇద్దరూ సూటూబూటూ వేసి డైనమిక్ గా కనిపిస్తున్నారు. ఈ ఫొటో షూట్ లో యువీ ఆర్ధాంగి హేజెల్ కీచ్, కుమార్తె ఆరా కూడా పాల్గొన్నారు.

ఆసక్తికర అంశం ఏమిటంటే... గతంలో యువరాజ్ తన వారసుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓరియన్ క్రికెటర్ కావాలని తాను కోరుకోవడం లేదని, ఒకవేళ అతడు క్రికెటర్ అవ్వాలనుకుంటే మాత్రం అడ్డుచెప్పబోనని స్పష్టం చేశాడు. ఓ తండ్రిగా, క్రికెటర్ గా తన బిడ్డ కూడా క్రికెటరే అవ్వాలని భావించడం సబబు కాదని, పెద్దయ్యాక వారి ఇష్టాయిష్టాలను అనుసరించి ప్రోత్సహించాలని యువీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

యువీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే... నటి హేజెల్ కీచ్ తో ప్రేమాయాణం తర్వాత ఆమెను 2017 నవంబరు 30న పెళ్లాడాడు. వారికి 2022లో ఓరియన్ జన్మించాడు. ఆ తర్వాత కుమార్తె జన్మించగా, ఆమెకు ఆరా అని పేరుపెట్టారు. 


More Telugu News