మా కుటుంబం క్యారెక్టర్ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు చాలా బాధపడ్డాం: జక్కంపూడి గణేశ్

  • ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలతో బాధపడ్డామన్న గణేశ్
  • బెట్టింగ్ క్లబ్ లు, ల్యాండ్ మాఫియా మీద చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్
  • ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదని వ్యాఖ్య
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత జక్కంపూడి గణేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో తమ కుటుంబం క్యారెక్టర్ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలతో తాము ఎంతో బాధపడ్డామని ఆయన అన్నారు. బెట్టింగ్ క్లబ్ లు, ల్యాండ్ మాఫియా మీద తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలని... లేకపోతే చేతగాని వాళ్లమని ఒప్పుకోవాలని సవాల్ విసిరారు. తమ క్యారెక్టర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదని అన్నారు. 

తన అన్నయ్య జక్కంపూడి రాజాను జనసేనలోకి రావాలని కోరినట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని గణేశ్ మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.



More Telugu News