Sanjay Dutt: దక్షిణాది సినిమాలపై సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు

Sanjay Dutt Key Comments on South Indian Films
  • దక్షిణాది సినిమాలతో దుమ్మురేపుతున్న సంజయ్ దత్
  • మంచి సినిమాలు చేయాలనే ప్యాషన్ సౌత్ లో ఉందని వ్యాఖ్య
  • బాలీవుడ్ లో కలెక్షన్లు, నంబర్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారని విమర్శ
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ దక్షిణాది సినిమాల్లో కూడా దుమ్మురేపుతున్నారు. విలన్ పాత్రల్లో అదరగొడుతున్నారు. తాజాగా సౌత్ సినిమాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి మీ ఇంటికి ఏం తీసుకెళతారు అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... మంచి సినిమాలు చేయాలనే ప్యాషన్ ను ఇక్కడి నుంచి బాలీవుడ్ కి తీసుకెళతానని చెప్పారు.

గతంలో బాలీవుడ్ కి కూడా మంచి సినిమాలపై ప్యాషన్ ఉండేదని... ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని.... ఇప్పుడు ప్రతి ఒక్కరు కలెక్షన్లు, నంబర్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారని సంజయ్ దత్ అన్నారు. దక్షిణాదిలో ఆ ప్యాషన్ ఇప్పటికీ ఉందని చెప్పారు. అందుకే తనకు సౌత్ సినిమాలలో నటించడం సంతోషంగా ఉందని చెప్పారు. 

కన్నడలో ధృవ సర్జా హీరోగా తెరకెక్కిన యాక్షన్ మూవీ 'కేడీ ది డెవిల్' మూవీ లో సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేశ్ అరవింద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదల చేశారు. 
Sanjay Dutt
South Indian Cinema
Bollywood
KD The Devil
Dhruva Sarja
Shilpa Shetty
Kannada Cinema
Indian Movies
Movie Collections

More Telugu News