శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ లాగిన్ తెరిచేందుకు యత్నం

  • శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘటన
  • కమిషనర్ హేమంత్ లాగిన్ తెరిచేందుకు యత్నించిన కంప్యూటర్ ఆపరేటర్
  • ఓటీపీ రావడంతో విషయం వెలుగులోకి!
హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో సైబర్ దాడికి ప్రయత్నించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అభిలాష్ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

బుధవారం అర్ధరాత్రి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ లాగిన్ తెరిచేందుకు అతను ప్రయత్నించాడు. జోనల్ కమిషనర్‌కు ఓటీపీ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే టౌన్ ప్లానింగ్ ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్ల లాగిన్‌లు కూడా తెరిచినట్లు గుర్తించారు. విచారణ అనంతరం అభిలాష్‌ను జోనల్ కమిషనర్ సస్పెండ్ చేశారు.


More Telugu News