హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు రిమాండ్ విధించిన మల్కాజ్‌గిరి కోర్టు

  • నకిలీ పత్రాలను సృష్టించి జగన్మోహన్ రావు అక్రమంగా అధ్యక్షుడియ్యాడన్న సీఐడీ
  • నిన్న జగన్మోహన్ రావును అరెస్టు చేసిన సీఐడీ
  •  వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచిన సీఐడీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్‌గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీఐడీ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. జగన్మోహన్ రావుని సీఐడీ నిన్న అరెస్టు చేసిన విషయం విదితమే.

శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాడని సీఐడీ ఆరోపిస్తోంది. గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించారని సీఐడీ తెలిపింది. ఆ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్‌సీఏ అధ్యక్షుడైనట్లు సీఐడీ చెబుతోంది. ఐపీఎల్ టికెట్ల వివాదంలోనూ ఆయనపై ఆరోపణలున్నాయి.


More Telugu News