Prasanna Kumar Reddy: నాది నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రక్తం... వచ్చి అరెస్ట్ చేసుకోండి: ప్రసన్నకుమార్ రెడ్డి

Prasanna Kumar Reddy Challenges Arrest After Allegations
  • ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు
  • పారిపోయానన్న ప్రచారాన్ని ఖండించిన ప్రసన్నకుమార్ రెడ్డి
  • కావాలంటే ఇప్పుడే అరెస్ట్ చేసుకోవచ్చంటూ పోలీసులకు సవాల్
  • చేతికి చికిత్స కోసమే చెన్నై వెళ్లానని స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే
  • తమ ఇంటిపై దాడి ఘటనలో నిష్పక్షపాత విచారణకు డిమాండ్
"నాది నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి రక్తం. భయపడటం అనేది మా బయోడేటాలోనే లేదు" అంటూ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పారిపోయానంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, కావాలంటే తనను ఇప్పుడే అరెస్ట్ చేసుకోవచ్చని పోలీసులకు సవాల్ విసిరారు.

కోవూరు టీడీనీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తనపై కేసు నమోదైన నేపథ్యంలో, ఆయన పారిపోయారంటూ ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలపై స్పందించేందుకు గురువారం నెల్లూరులో ప్రసన్నకుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, చేతికి గాయం కావడంతో చికిత్స కోసం చెన్నైలోని ఆసుపత్రికి వెళ్లానని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

"నేను నెల్లూరు వదిలి పారిపోయానని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉంది. నేను ఎక్కడికీ వెళ్లను, ఇక్కడే ఉంటాను. నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు" అని ఆయన అన్నారు. అలాగే, నెల్లూరులోని తమ ఇంటిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి వీడియో ఆధారాలు ఉన్నాయని, ఆ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Prasanna Kumar Reddy
Nallapareddy Srinivasulu Reddy
Vemireddy Prasanthi Reddy
Kovuru MLA
Nellore
YSRCP
Andhra Pradesh Politics
Arrest Challenge
Political Controversy
Police Investigation

More Telugu News