Delhi Earthquake: ఢిల్లీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Delhi Earthquake Tremors Felt Across NCR Region
  • ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో బలమైన భూప్రకంపనలు
  • హర్యానాలోని రేవారి జిల్లాలో భూకంప కేంద్రం 
  • కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి
  • ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో (ఎన్‌సీఆర్) ఈ ఉదయం బలమైన భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి బలంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్నవారు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనతో బయటకు పరుగులు తీశారు.

ఈ భూకంప కేంద్రం హర్యానాలోని రేవారి జిల్లాలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రేవారి జిల్లా పరిధిలోని గురవార అనే ప్రాంతానికి సమీపంలో భూకంపం సంభవించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

భూకంప కేంద్రం హర్యానాలో ఉన్నప్పటికీ, దాని ప్రభావం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ వంటి జాతీయ రాజధాని ప్రాంతం అంతటా స్పష్టంగా కనిపించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
Delhi Earthquake
Earthquake Delhi
Delhi NCR
Haryana Earthquake
Rewari Haryana
Gurugram
Noida
Earthquake Today

More Telugu News