Anjali Devi: ఆ ఒక్క సినిమాతో అంజలీదేవి ఆస్తులన్నీ పోయాయట!

Nandam  Harishchandra Rao Interview
  • 1940లలో ఇండస్ట్రీకి వచ్చిన అంజలీదేవి 
  • 'గొల్లభామ' సినిమాతో మొదలైన ప్రస్థానం
  • వరుస హిట్లతో వచ్చిన స్టార్ డమ్ 
  • భారీ నష్టం తెచ్చిన హిందీ సినిమా 
  • పట్టుదలతో కోలుకున్న అంజలీదేవి

తెలుగు సినిమా తొలితరం కథానాయికలలో అంజలీదేవి ఒకరు. 1940ల లోనే నటిగా ఆమె తన కెరియర్ ను మొదలుపెట్టారు. చిన్నప్పటి నుంచి నాటక ప్రదర్శనల ద్వారా సంపాదించిన అనుభవంతో ఆమె మద్రాస్ కి చేరుకున్నారు. 'గొల్లభామ' సినిమాతో పరిచయమైన ఆమె, ఆ తరువాత అనేక సినిమాలతో అగ్రకథానాయికగా నిలిచారు. అలాంటి అంజలీదేవిని గురించి సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్రరావు, 'ట్రీ మీడియా'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

" అంజలీదేవిగారికి 'గొల్లభామ' .. 'కీలుగుర్రం' సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. ఆనాటి స్టార్ హీరోలందరితోను ఆమె నటించారు. సంగీత దర్శకుడిగా ఆదినారాయణరావు గారికి కూడా మంచి పేరు వచ్చింది. అలా ఇద్దరూ ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున నిర్మాతలుగాను మారారు. హిందీలో 'ఫూలోమ్ కి శేజ్' సినిమాను నిర్మించారు. అశోక్ కుమార్ .. మనోజ్ కుమార్ .. వైజయంతిమాల నటించారు" 

అయితే ముందుగా అనుకున్న దానికంటే ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. విడుదలైన తరువాత సరిగ్గా ఆడకపోవడంతో, విపరీతమైన నష్టాలు వచ్చాయి. దాంతో అప్పటివరకూ సంపాదించుకున్న ఆస్తులన్నీ అమ్ముకోవలసి వచ్చింది. అయితే కుంగిపోకుండా నిదానంగా కోలుకుని చేసిన 'సతీ సక్కుబాయి' .. 'భక్త తుకారాం' వంటి సినిమాలు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. అంజలీదేవి కష్టాల్లో ఉందనే శివాజీ గణేశన్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 'భక్త తుకారాం'లో శివాజీగా చేశారు" అని చెప్పారు. 

Anjali Devi
Gollabhama
Keelugurram
Telugu cinema actress
Adinarayana Rao
Phoolon Ki Sej
Sati Sakkubai
Bhakta Tukaram
Tollywood
actress assets loss

More Telugu News