Milan Bergamo Airport: ఇటలీ ఎయిర్‌పోర్ట్‌లో ఘోరం.. విమానం ఇంజిన్‌లో చిక్కుకుని వ్యక్తి దుర్మరణం

Man Dies After Being Sucked Into Airplane Engine at Italy Airport
  • మిలాన్ బెర్గామో విమానాశ్రయంలో విషాద ఘటన
  • భద్రతను దాటుకుని రన్‌వేపైకి వెళ్లిన ఓ వ్యక్తి
  • ఎయిర్‌బస్ ఏ319 ఇంజిన్‌లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి
  • ఘటనతో గంటల పాటు నిలిచిన విమాన సర్వీసులు
  • ఆత్మహత్యా, మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు
ఇటలీలోని మిలాన్ బెర్గామో విమానాశ్రయంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయ భద్రతా వలయాన్ని దాటుకొని రన్‌వేపైకి ప్రవేశించిన ఒక వ్యక్తి, అక్కడ సిద్ధంగా ఉన్న విమానం ఇంజిన్‌లో చిక్కుకుని మరణించాడు. ఈ ఘటన మంగళవారం జరగగా, స్థానికంగా కలకలం రేపింది.

విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 35 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తి తన వాహనాన్ని విమానాశ్రయం వెలుపల వదిలి లోపలికి ప్రవేశించాడు. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి, విమానాల పార్కింగ్ జోన్‌కు వెళ్లే అత్యవసర ద్వారాన్ని బలవంతంగా తెరిచి రన్‌వే వైపు పరుగెత్తాడు. అదే సమయంలో టేకాఫ్‌కు సిద్ధమవుతున్న ఎయిర్‌బస్ ఏ319 విమానం సమీపానికి చేరుకున్నాడు. వేగంగా తిరుగుతున్న ఇంజిన్ అతడిని బలంగా లోపలికి లాగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఇంజిన్‌ను ఆపివేసి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ దుర్ఘటన కారణంగా విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కొద్ది గంటలపాటు అంతరాయం కలిగింది. మృతుడు ఆత్మహత్య చేసుకునేందుకే ఈ చర్యకు పాల్పడ్డాడా, లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని అధికారులు తెలిపారు.
Milan Bergamo Airport
Italy airport accident
airplane engine death
airport security breach

More Telugu News