వైఎస్ స్మారకం కోసం సీఎం రేవంత్ కు షర్మిల విజ్ఞప్తి!
- తండ్రి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు
- ఇదే అంశంపై సోనియా గాంధీకి లేఖ రాసినట్లు వెల్లడి
- రేవంత్ సర్కార్ తన అభ్యర్థనను నెరవేరుస్తుందని ఆశాభావం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మంగళవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆమె తన తండ్రికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచేలా హైదరాబాద్‌లో స్మారకాన్ని నిర్మించడం సముచితమని అన్నారు. హైదరాబాద్‌లో తన తండ్రి పేరు మీద స్మృతివనం నిర్మించాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆమె వెల్లడించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభ్యర్థనను సానుకూలంగా పరిగణించి, స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు.