కెనడాలో భార‌తీయ విద్యార్థిని మృతి

  • ఢిల్లీకి చెందిన తాన్యా త్యాగిగా గుర్తింపు
  • కాల్గరీ వర్సిటీలో చదువుకుంటున్న యువతి
  • ఆమె మరణానికి తెలియరాని కారణాలు 
  • తాన్యా కుటుంబానికి అండగా ఉంటామన్న‌ భారత కాన్సులేట్
కెనడాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉన్నత విద్య కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని అక్కడ మరణించారు. అయితే, ఆమె మృతికి దారితీసిన స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ దురదృష్టకర సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మృతురాలిని ఢిల్లీకి చెందిన తాన్యా త్యాగిగా గుర్తించారు. ఆమె కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. తాన్యా త్యాగి నిన్న చ‌నిపోయినట్లు వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది. విద్యార్థిని మరణవార్త తెలియగానే అధికారులు స్పందించారు.

ఈ ఘటన పట్ల కాన్సులేట్ అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాన్యా త్యాగి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. 

అయ‌తే, తాన్యా మృతికి దారితీసిన పరిస్థితులు, కచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని కాన్సులేట్ వర్గాలు పేర్కొన్నాయి. స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


More Telugu News