వైజాగ్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు... కారణం ఇదే

  • అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో సీఎం విశాఖ పర్యటన రద్దు
  • విశాఖలో జరగాల్సిన ఇంధన వనరుల వర్క్‌షాప్‌లో పాల్గొనాల్సి ఉన్న ముఖ్యమంత్రి
  • ప్రభుత్వం చేపట్టాలనుకున్న 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం కూడా రద్దు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలపై ప్రభావం చూపింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో, ఈనాటి విశాఖ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. 

ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఈరోజు విశాఖలో పర్యటించాల్సి ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన 'న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్‌షాప్'లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దీంతో పాటు, కూటమి ప్రభుత్వం 'సుపరిపాలనలో తొలి అడుగు' పేరిట నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు.

మరోవైపు, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది మరణించడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


More Telugu News