దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్!

  • దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి కలిసి చేసిన డ్యాన్స్ వైరల్
  • సోషల్ మీడియాలో వేగంగా విస్తరించిన వీడియో
  • సాంప్రదాయ, ఆధునిక నృత్యాల మేళవింపు
  • శ్రీనివాస్, మాధురి మధ్య కెమిస్ట్రీ, సమన్వయానికి ప్రశంసలు
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట మ‌రోసారి త‌మ డ్యాన్స్‌తో అల‌రించింది. తాజాగా హైద‌రాబాద్‌లో దువ్వాడ కూతురు హాఫ్ శారీ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ వేడుక‌లో వీరిద్ద‌రూ క‌లిసి హిందీ డ్యూయెట్ పాట‌కు స్టెప్పులేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వగా వైర‌ల్‌గా మారింది. 

ఇందులో సాంప్రదాయ భారతీయ నృత్య రీతులతో పాటు ఆధునిక కొరియోగ్రఫీని మేళవించి, ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా జంట బాగానే డ్యాన్స్‌ చేసింది. ఇప్పటికే శాస్త్రీయ నృత్యంలో తన ప్రతిభకు, ఒక వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా పేరుగాంచిన దివ్వెల మాధురి, తనదైన శైలిలో ఈ ప్రదర్శనకు వన్నె తెచ్చారు. ఈ వీడియోను ఆమె త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. 

వీడియో చూసిన నెటిజ‌న్లు ద‌వ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య అద్భుతమైన సమన్వయం, ప్రదర్శనలో కనబరిచిన ఉత్సాహం బాగుంద‌ని పలువురు కామెంట్లలో పేర్కొన్నారు.



More Telugu News