Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఇప్పుడెలా ఉన్నారో చూశారా?

Kota Srinivasa Rao Health Update Veteran Actor Seen With Bandla Ganesh

  • కొంతకాలంగా సినిమాలకు దూరంగా కోట శ్రీనివాసరావు
  • వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కోట
  • కోటను కలిసిన బండ్ల గణేశ్

తెలుగు సినీ యవనికపై తనదైన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1947 జులై 10న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన ఆయన, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో తెలుగు సినిమాతో పాటు భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించారు. ఇటీవల కొంతకాలంగా ఆయన సినిమాల్లో కనిపించడంలేదు. 82 ఏళ్ల కోట వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. 

తాజాగా కోట శ్రీనివాసరావును ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కలిశారు. కోట బాబాయ్ ని కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కోటతో కలిసున్న ఫొటోను కూడా బండ్ల గణేశ్ పంచుకున్నారు. అయితే, ఆ ఫొటో చూస్తే... కోట ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఓ కాలికి బ్యాండేజి, మరో కాలికి నయనమైన గాయాల ఆనవాళ్లతో, బాగా బలహీనంగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కోటను ఇలా చూసిన అభిమానులు బాధపడుతున్నారు. 
తిరుగులేని విలనిజం!
1978లో విడుదలైన "ప్రాణం ఖరీదు" చిత్రంతో వెండితెరకు పరిచయమైన కోట శ్రీనివాసరావు, ఇప్పటివరకు 650కి పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయ నటుడిగా ఇలా పలు విభిన్న పాత్రలలో ఆయన ప్రదర్శించిన అద్భుతమైన నటన ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన నటనలోని వైవిధ్యం చిత్ర పరిశ్రమలో ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

ఎన్ని నందులో!
తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కోట శ్రీనివాసరావు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా, ఉత్తమ నటుడిగా ఆయన ప్రతిభకు గుర్తింపుగా తొమ్మిది సార్లు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2015లో భారత ప్రభుత్వం ఆయనను దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ'తో సత్కరించింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ నటించి తన ప్రతిభను చాటుకున్నారు. 

Kota Srinivasa Rao
Kota Srinivasa Rao health
Bandla Ganesh
Telugu actor
veteran actor
Telugu cinema
Nandi Awards
Padma Shri
Telugu movies
Indian cinema
  • Loading...

More Telugu News