Chal Kapatt: అసలు హంతకులు ఎవరు? .. జీ 5లో బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్!

Chhal Kapat Series Update

  • బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ గా 'ఛల్ కపట్'
  • ఈ నెల 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • 7 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి 
  • మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ


ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విపరీతమైన క్రేజ్ ఉన్న జోనర్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. అందువల్లనే  ఓటీటీ సంస్థలు ఈ జోనర్ నుంచి సినిమాలు .. సిరీస్ లు వదులుతూ ఉంటాయి. అలా రీసెంటుగా ఓటీటీకి వచ్చిన సిరీస్ గా 'ఛల్ కపట్' కనిపిస్తుంది. ఈ నెల 6వ తేదీ నుంచి 7 ఎపిసోడ్స్ గా  ఈ సిరీస్ 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది.

అజయ్ భూయాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో, శ్రియ పిల్లవ్ కర్ .. స్మరణ్ సాహూ .. తుహిన దాస్ .. అనూజ్ సచ్ దేవా .. కామ్య అహ్లావత్ .. రాగిణి ద్వివేది ప్రధానమైన పాత్రలను పోషించారు. ఒక ఫంక్షన్ లో జరిగిన హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అనూహ్యమైన మలుపులు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. 

కథ విషయానికి వస్తే .. ఒక ఫంక్షన్ కి వెళ్లిన 'షాలు' అక్కడ దారుణంగా హత్య చేయబడుతుంది. ఈ విషయం తెలియగానే పోలీస్ ఆఫీసర్ 'దేవికా రాథోడ్' రంగంలోకి దిగుతుంది. హత్యకి సంబంధించి ఒక తొమ్మిది మందిని ఆమె అనుమానితులుగా భావిస్తుంది. ఆ తొమ్మిది మంది ఎవరు? 'షాల'ను ఎవరు హత్య చేశారు? అందుకు గల కారణం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది. 

Chal Kapatt
ZEE5
Bollywood thriller
crime thriller series
Shriya Pilgaonkar
Smaran Sahoo
Ajay Bhuyan
investigative thriller
  • Loading...

More Telugu News