ముంబై లోకల్ ట్రైన్లో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
- కిక్కిరిసిన బోగీ నుంచి జారిపడిన 12 మంది ప్రయాణికులు
- దివా-ముంబ్రా స్టేషన్ల మధ్య ప్రమాదం
- గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స
- ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన రైల్వే అధికారులు
ప్రయాణికుల రద్దీ, రైలు బోగీ కిక్కిరిసిపోయి ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తీవ్రమైన రద్దీ వల్ల కొందరు ప్రయాణికులు డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించారని, ఈ క్రమంలోనే వారు అదుపుతప్పి కిందపడిపోయారని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, పరిస్థితులపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ముంబై లోకల్ ట్రైన్లలో తరచూ కనిపించే రద్దీ సమస్య మరోసారి ఈ ఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది.