Telangana cabinet: తెలంగాణ రాజ్ భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకారం

Telangana Ministers Sworn in at Raj Bhavan

––


తెలంగాణ క్యాబినెట్ లో మరో ముగ్గురు నేతలకు చోటు దక్కింది. కొత్తగా ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నూతన మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. 

తాజా విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే అవకాశం కల్పించింది. కాగా, ఈసారి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కుతుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది. కొత్త మంత్రులతో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రునాయకన్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.

Telangana cabinet
Gaddam Vivek
Vakiti Srihari
Addluri Laxman Kumar
Revanth Reddy
Telangana Ministers
Telangana Raj Bhavan
Congress Party
Telangana Politics
Ramachandrunayakan
  • Loading...

More Telugu News