Elon Musk: రాజకీయ పార్టీ పెడుతున్న మస్క్.. పేరు కూడా ఖరారు!
- ‘ది అమెరికా పార్టీ’ పేరుతో కొత్త పార్టీ
- ట్విట్టర్ లో పోల్ నిర్వహించిన టెస్లా అధినేత
- అనుకూలంగా 80 శాతం మంది ఓటు
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారా.. అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే జవాబిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మస్క్ కు విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు విశేషంగా కృషి చేసిన మస్క్.. ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేశారు. ట్రంప్ సర్కారులో మస్క్ కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇటీవలి కాలంలో వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వ పదవి నుంచి మస్క్ వైదొలిగారు.
ప్రస్తుతం ఒకరితో మరొకరు ఫోన్ లో సంభాషించుకోవడానికీ తీవ్ర విముఖత ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి మస్క్ ఓ కొత్త చర్చ లేవనెత్తారు. తన సోషల్ మీడియా ప్లాట్ పాం ‘ఎక్స్’ లో ఓ పోల్ నిర్వహించారు. ఆసక్తికరంగా 80శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ క్రమంలోనే ‘ది అమెరికా పార్టీ’ అంటూ మస్క్ పోస్ట్ చేశారు.
అమెరికాలోని 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి తగిన సమయం ఇదేనా అంటూ మస్క్ పోల్ నిర్వహించారు. ఈ పోల్లో కొత్త పార్టీ ఇప్పుడు అవసరమేనని 80 శాతం మంది అనుకూలంగా ఓటేశారని ఆయన వెల్లడించారు. దీంతో ‘ది అమెరికా పార్టీ’ పేరుతో మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే, ఎలాన్ మస్క్ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.