Nagarjuna: కుమారుడి పెళ్లిలో నాగార్జున అదిరిపోయే డ్యాన్స్.. ఇదిగో వీడియో!

- నిన్న వివాహబంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని వారసుడు
- తన ప్రియురాలు జైనబ్ మెడలో మూడు ముళ్లు వేసిన అఖిల్
- నిన్న తెల్లవారుజమున 3.30 గంటలకు జరిగిన పెళ్లి
- ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన నాగ్
- అఖిల్ సంగీత్ వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టిన నాగార్జున
- వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ శుక్రవారం వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన ప్రియురాలు జైనబ్ మెడలో అఖిల్ మూడు ముళ్లు వేశాడు. నిన్న తెల్లవారుజామున 3.30 గంటలకు తన కుమారుడి పెళ్లి జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా నాగ్ అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకి చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీతో పాటు పలువురు సినీ తారలు కూడా హాజరై సందడి చేశారు.
ఇక, పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా అదిరిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేడుకకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో అఖిల్ సంగీత్ వేడుకలో నాగార్జున చేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వీడియోలో నాగార్జున తనదైన ఐకానిక్ స్టెప్ వేస్తూ ఎంజాయ్ చేయడం ఉంది. ఆయనతో పెళ్లి కొడుకు అఖిల్ అతని సోదరుడు నాగ చైతన్య కూడా జత కలిశారు. అక్కినేని అందగాళ్లంతా కలిసి ఇలా వేదికపై కాలు కదపడం అక్కడున్న వారందరికీ మంచి ఉత్సాహాన్ని కలిగించింది.
కాగా, గతేడాది నవంబర్ 26న అఖిల్-జైనబ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తీసిన ఫొటోలను నాగార్జున స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడు కూడా అదే బాటలో పెళ్లి ఫొటోలు ఆయనే విడుదల చేశారు. ఇవి చూసిన అక్కినేని అభిమానులు, నెటిజన్లు జంట చూడముచ్చటగా ఉందని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.